జగన్ స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం: బీజేపీ నేత
ABN , First Publish Date - 2020-12-05T21:03:08+05:30 IST
జగన్ స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం: బీజేపీ నేత
తూర్పుగోదావరి: జిల్లాలోని రావులపాలెం- అమలాపురం రహదారిపై బీజేపీ ఆందోళన చేపట్టింది. రోడ్లకు మరమ్మతులు చేపట్టాలంటూ బీజేపీ నేత సోము వీర్రాజు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం రహదారుల మరమ్మతులను విస్మరించిందని ఆయన మండిపడ్డారు. జగన్ ఇప్పుడు పాదయాత్ర చేస్తే రోడ్ల దుస్థితి తెలుస్తుందన్నారు. సీఎం జగన్ స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్త పోరాటం చేస్తామని సోము వీర్రాజు హెచ్చరించారు.