‘4 జిల్లాల్లో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి’
ABN , First Publish Date - 2020-04-25T17:10:50+05:30 IST
కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్థన్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో 4 జిల్లాలో 70శాతం కరోనా కేసులు ఉన్నాయన్నారు.

విజయవాడ: కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్థన్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో 4 జిల్లాలో 70శాతం కరోనా కేసులు ఉన్నాయన్నారు. 4 జిల్లాల్లో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు లాక్‌డౌన్ నిబంధనలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా బులెటిన్‌లలో లోపాలు ఉన్నా సరిదిద్దుకోవడం లేదన్నారు. రంజాన్ మాసంలో భోజనం పంపిణీ చేసేందుకు దాతలకు అవకాశం ఇవ్వడం సరికాదన్నారు.