విజయవాడ: మాజీ మంత్రి మాణిక్యాలరావుకు బీజేపీ నివాళి
ABN , First Publish Date - 2020-08-11T18:32:44+05:30 IST
ఇటీవల మరణించిన మాజీ మంత్రి పైడికొండ మాణిక్యాలరావుకు బీజేపీ నివాళులర్పించింది.

విజయవాడ: ఇటీవల మరణించిన మాజీ మంత్రి పైడికొండ మాణిక్యాలరావుకు బీజేపీ నివాళులర్పించింది. ప్రాణాలు కోల్పోయిన జవాన్లు, ఫైర్ ప్రమాదంలో కరోనా పేషెంట్‌ల మృతికి సంతాపంగా బీజేపీ నేతలు నిమిషం మౌనం పాటించి నివాళి అర్పించారు. అనంతరం ఏపీ రాష్ట్ర అధ్యక్షునిగా సోము వీర్రాజు బాధ్యత స్వీకార సభను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.