టీడీపీ, వైసీపీకి సమాన దూరంలో ఉంటాం: పురందేశ్వరి

ABN , First Publish Date - 2020-03-09T00:29:21+05:30 IST

టీడీపీ, వైసీపీకి సమాన దూరంలో ఉంటాం: పురందేశ్వరి

టీడీపీ, వైసీపీకి సమాన దూరంలో ఉంటాం: పురందేశ్వరి

విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పనిచేస్తాయని బీజేపీ నేత పురందేశ్వరి తెలిపారు. వాలంటీర్‌ వ్యవస్థను పెట్టుకొని వైసీపీ ఎన్నికలకు వెళ్తోందన్నారు. ఇవాళ బీజేపీ-జనసేన సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కక్షపూరిత వైఖరితో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి పనులు జరగడంలేదని పేర్కొన్నారు. బీజేపీ-జనసేన నేతలను కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. టీడీపీ, వైసీపీకి సమాన దూరంలో ఉంటామన్నారు. 

Updated Date - 2020-03-09T00:29:21+05:30 IST