వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ విష్ణుకుమార్‌రాజు

ABN , First Publish Date - 2020-12-31T00:19:35+05:30 IST

జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం హిందూ సమాజం దౌర్భాగ్యం అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్‌రాజు అన్నారు

వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ విష్ణుకుమార్‌రాజు

విజయనగరం: జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం హిందూ సమాజం దౌర్భాగ్యం అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్‌రాజు అన్నారు. 18 నెలల వైసీపీ పాలనలో 20 హిందూ దేవాలయాలపైన, దేవతామూర్తులపై దాడులు కిరాతకమైనవని చెప్పారు. రాష్ట్రంలోని పలువురు మంత్రుల మాట తీరు సమాజమంతా తలదించుకొనే విధంగా ఉందన్నారు. జగన్మోహన్‌రెడ్డికి సమయం దగ్గరపడిందని వ్యాఖ్యానించారు.. రాముడు తల నరికిని ఘటనపై ముఖ్యమంత్రి కనీసం ఖండించకపోవటం ఆయన స్వభావానికి నిదర్శనం అని పేర్కొన్నారు. రామతీర్ధం ఘటనపై రేపు ఉత్తరాంధ్రలోని అన్ని మండల కేంద్రాలలో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు విష్ణుకుమార్‌రాజు వెల్లడించారు.

Updated Date - 2020-12-31T00:19:35+05:30 IST