-
-
Home » Andhra Pradesh » BJP state president Somu veeraju
-
ఇసుకను బంగారం కంటే విలువైందిగా మార్చేశారు: సోము వీర్రాజు
ABN , First Publish Date - 2020-12-28T23:32:16+05:30 IST
వైసీపీ ప్రభుత్వం ఇసుకను బంగారం కంటే విలువైనదిగా మార్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. స్వలాభాల కోసం

కడప: వైసీపీ ప్రభుత్వం ఇసుకను బంగారం కంటే విలువైనదిగా మార్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. స్వలాభాల కోసం నదుల్లో ఇసుకను అక్రమంగా తవ్వుకుంటున్నారని ఆరోపించారు. ఎర్రచందనం అక్రమరవాణా విచ్చలవిడిగా జరుగుతుంటే అడిగే నాధుడు కరువయ్యారని సోము వీర్రాజు ధ్వజమెత్తారు.
బీజేపీలోకి సాయి ప్రతాప్ అల్లుడు
మాజీ కేంద్ర మంత్రి సాయి ప్రతాప్ అల్లుడు సాయి లోకేష్‌కుమార్ బీజీపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకముందు మన్నూరు ఎల్లమ్మ ఆలయం నుంచి సంగరాజు వేదిక వరకు ఊరేగింపుగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో సోము వీర్రాజు పాల్గొన్నారు.