బీజేపీకి పూర్తిగా సహకరిస్తా: శిల్పా చక్రపాణిరెడ్డి

ABN , First Publish Date - 2020-12-28T02:02:31+05:30 IST

ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు, ఉద్యోగుల బదిలీపై ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి స్పందించారు. తప్పు చేసి ఉంటే ఎవరైనా సరే చర్యలకు సిద్ధ పడాల్సిందేనని చెప్పారు.

బీజేపీకి పూర్తిగా సహకరిస్తా: శిల్పా చక్రపాణిరెడ్డి

కర్నూలు: ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు, ఉద్యోగుల బదిలీపై ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి స్పందించారు. తప్పు చేసి ఉంటే ఎవరైనా సరే చర్యలకు సిద్ధ పడాల్సిందేనని చెప్పారు. తప్పు చేశారా లేదా అనే దానిపై బీజేపీ నిజనిర్ధారణ కమిటీ వేసుకోవచ్చన్నారు. బీజేపీ కమిటీ వేసుకుంటే పూర్తిగా సహకరిస్తామని ఆయన ప్రకటించారు. ఆరోపణలు మాని ఆలయ అభివృద్ధికి సహకరించాలని శిల్పా చక్రపాణిరెడ్డి కోరారు.


కొన్ని రోజులుగా ఎమ్మెల్యే రాజాసింగ్, శిల్పా చక్రప్రాణిరెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. శ్రీశైలంలోని దుకాణ సముదాయాల్లో ముస్లింలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటూ రాజాసింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే. తాత్కాలిక ప్రాతిపదికన ఇచ్చిన షాపులను తీసేయాలని కోర్టు ఆదేశించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యే చక్రపాణి ఓ టీమ్ తయారుచేసి, రజాక్ అనే వ్యక్తికి బాధ్యతలు అప్పగించారని ఆరోపించారు. రాజాసింగ్‌కు చక్రపాణిరెడ్డి ఘాటుగా సమాధానమిచ్చారు. తనపై చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. రాజాసింగ్ ఎప్పుడు వస్తానంటే అప్పుడు శ్రీశైలంలో పెద్దల సమక్షంలో చర్చకు సిద్ధమని అన్నారు. తనపై ఆరోపణలు నిరూపించకపోతే రాజీనామాకు సిద్ధమా? అని ప్రశ్నించారు. ఎన్నో దేవాలయాలకు తాను ఆర్థిక సహాయం చేశానని, అలాంటి తనను పట్టుకొని హిందూ ద్రోహిగాముద్రవేయాలని చూస్తున్నారని చక్రపాణిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-12-28T02:02:31+05:30 IST