తిరుపతి: అలిపిరి పాదాల వద్ద బీజేపీ ఆందోళన

ABN , First Publish Date - 2020-09-21T18:06:59+05:30 IST

తిరుమల అలిపిరి పాదాలవద్ద బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు.

తిరుపతి: అలిపిరి పాదాల వద్ద బీజేపీ ఆందోళన

తిరుపతి: తిరుమల అలిపిరి పాదాలవద్ద బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. నిన్న మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. తిరుమల తిరుపతి సంరక్షణ సమితి, విశ్వహిందూ పరిషత్, బీజేపీ నేతలు అందరూ కలిసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏసు ప్రభువుకి ఒక చేయి విరిగిపోతే ఏమౌతుందని ఆయన మీడియా ముందు మాట్లాడగలరా? అని ప్రశ్నించారు. అలాగే మసీదులోకి వెళ్లి రామభజన చేస్తే ఏమవుతుందని అడగగలరా? అని నిలదీశారు.


హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. అధికార మదంతో రెచ్చిపోయి పిచ్చిపట్టిన మంత్రికి ఆంజనేయ స్వామిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు తగు రీతిలో గుణపాఠం చెబుతామని నేతలు హెచ్చరించారు. కొడాలి నాని వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్ స్పందించాలని కోరారు. మత రాజకీయాలు చేస్తున్న మంత్రి కొడాలి నాని తగిన రాజకీయ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.

Updated Date - 2020-09-21T18:06:59+05:30 IST