కళ్లకూ మాస్కులేసుకున్న సీఎం: సునీల్‌ దేవధర్‌

ABN , First Publish Date - 2020-11-13T09:36:20+05:30 IST

‘‘ఒక విజ్ఞప్తి చేస్తున్నా... అందరూ మాస్కులు పెట్టుకోండి. ముక్కు వరకు మాత్రమే పెట్టుకోండి... కళ్లకు మాస్కులు పెట్టుకోవద్దు. ఎందుకంటే సీఎం జగన్మోహన్‌రెడ్డి

కళ్లకూ మాస్కులేసుకున్న సీఎం: సునీల్‌ దేవధర్‌

తిరుపతి(పద్మావతినగర్‌), నవంబరు 12: ‘‘ఒక విజ్ఞప్తి చేస్తున్నా... అందరూ మాస్కులు పెట్టుకోండి. ముక్కు వరకు మాత్రమే పెట్టుకోండి... కళ్లకు మాస్కులు పెట్టుకోవద్దు. ఎందుకంటే సీఎం జగన్మోహన్‌రెడ్డి కళ్లకు కూడా మాస్కులు పెట్టుకున్నాడు. అందుకే రాష్ట్రంలో మాఫియాలు చెలరేగిపోతుంటే ఆయన చూడలేకపోతున్నాడు’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ దేవధర్‌ అన్నారు. గురువారం తిరుపతిలో జరిగిన బీజేపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. ‘‘శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్‌ జోరుగా సాగుతోంది.


లాండ్‌, ఇసుక మాఫియా చెలరేగిపోతున్నా జగన్‌ చూడలేకపోతున్నాడు. దేవాలయాల, ట్రస్టుల భూములు ఏమైపోతున్నాయి?’’ అని ప్రశ్నించారు. కరోనా వారియర్స్‌కు జీతాలు ఇవ్వలేరుగాని... పాస్టర్లకు, ఇమాంలకు జీతాలు ఇస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేసీఆర్‌, ఏపీలో జగన్మోహన్‌రెడ్డి పూర్తిగా విఫలం అయ్యారని విమర్శించారు. బీజేపీ, జనసేన రాష్ట్రంలో అవినీతిని, కుటుంబపాలనను పెకలిసిస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

Updated Date - 2020-11-13T09:36:20+05:30 IST