ఎయిమ్స్ వైద్యుల సహాయం తీసుకోవాలి: జీవీఎల్

ABN , First Publish Date - 2020-12-07T00:02:09+05:30 IST

ఏలూరులో వందల మంది అస్వస్థతకు కారణం మాస్ హిస్టీరియా కాదని.. టాక్సిన్స్ ..

ఎయిమ్స్ వైద్యుల సహాయం తీసుకోవాలి: జీవీఎల్

అమరావతి: ఏలూరులో వందల మంది అస్వస్థతకు కారణం మాస్ హిస్టీరియా కాదని.. టాక్సీన్లతో కలిగిన అస్వస్థత అయి ఉంటుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రన్దీప్ గులేరియాతో మాట్లాడినట్లు  తెలిపారు. మంగళగిరి ఎయిమ్స్  నుంచి సీనియర్ డాక్టర్ల బృందం బయలుదేరిందని.. వారి వైద్య సహాయాన్ని సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. ఏపీ సీఎస్ నీలం సహానీతో మాట్లాడి పరిస్థితులను సమన్వయం చేస్తున్నామన్నారు. ప్రజలు భయాందోళనకు గురి అవ్వకుండా ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. 

Read more