దిగజారుడు వ్యాఖ్యలు.. అసహ్యమేస్తోంది: ఎమ్మెల్సీలు
ABN , First Publish Date - 2020-04-21T09:04:15+05:30 IST
‘‘పెద్దల సభలో ఉండే వ్యక్తి చీప్ పాపులారిటీ కోసం దిగజారుడు వ్యాఖ్యలు చేయడం అసహ్యంగా ఉంది. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై అసత్య,

అమరావతి, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): ‘‘పెద్దల సభలో ఉండే వ్యక్తి చీప్ పాపులారిటీ కోసం దిగజారుడు వ్యాఖ్యలు చేయడం అసహ్యంగా ఉంది. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై అసత్య, నిరాధార ఆరోపణలు చేసిన జైలుపక్షి విజయసాయిరెడ్డి తక్షణమే వాటిని ఉపసంహరించుకోవాలి’’ అని బీజేపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్, వాకాటి నారాయణరెడ్డి సోమవారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. యువమోర్చా అధ్యక్షుడిని అరెస్టు చేయించడం సరికాదన్నారు. అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుంటే న్యాయపరమైన పోరాటానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఇదే డిమాండ్‌తో బీజేపీ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, రావెల కిశోర్ బాబు వేర్వేరుగా ప్రకటనలు చేశారు.