పనిచేయని ఎమ్మెల్సీ మాధవ్ ఫోన్.. ఆందోళనలో కుటుంబ సభ్యలు

ABN , First Publish Date - 2020-09-18T01:20:51+05:30 IST

బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఫోన్ పనిచేయట్లేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం చలో అంతర్వేది

పనిచేయని ఎమ్మెల్సీ మాధవ్ ఫోన్.. ఆందోళనలో కుటుంబ సభ్యలు

విశాఖ: బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఫోన్ పనిచేయట్లేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం చలో అంతర్వేది నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్.. విశాఖపట్నం నుంచి కాకినాడ బయలుదేరి వెళ్లారు. సాయంత్రం నుంచి ఆయన ఫోన్ స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడుతున్నారు. ఎక్కడైనా అదుపులోకి తీసుకున్నారా? అంటూ కుటుంబ సభ్యులు తూర్పుగోదావరి జిల్లా పోలీసులను ఆరా తీశారు. కానీ పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2020-09-18T01:20:51+05:30 IST