‘వైసీపీ అభ్యర్థులతో డబ్బు పంపిణీ చేయించడం దారుణం’

ABN , First Publish Date - 2020-04-05T17:43:00+05:30 IST

‘వైసీపీ అభ్యర్థులతో డబ్బు పంపిణీ చేయించడం దారుణం’

‘వైసీపీ అభ్యర్థులతో డబ్బు పంపిణీ చేయించడం దారుణం’

విశాఖ: రేషన్‌కార్డుదారులకు వైసీపీ అభ్యర్థులతో డబ్బు పంపిణీ చేయించడం దారుణమని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.  కేంద్రం డబ్బులు ఇస్తుంటే.. వైసీపీ క్రెడిట్‌ తీసుకుంటోందని చెప్పారు. ప్రభుత్వంలో పార్టీని జొప్పించడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. పాఠశాలలో నాడు-నేడు చేపట్టాలంటూ ఇచ్చిన జీవోను వెనక్కి తీసుకోవాలన్నారు.  కరోనా అనుమానితులను క్వారెంటైన్ కేంద్రాలకు తరలించడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందన్నారు. 

Updated Date - 2020-04-05T17:43:00+05:30 IST