సీఎం జగన్ కరోనాను చాలా లైట్‌గా తీసుకున్నారు: విష్ణుకుమార్

ABN , First Publish Date - 2020-07-28T17:49:34+05:30 IST

సీఎం జగన్ కరోనాను చాలా లైట్‌గా తీసుకున్నారు: విష్ణుకుమార్

సీఎం జగన్ కరోనాను చాలా లైట్‌గా తీసుకున్నారు: విష్ణుకుమార్

విశాఖపట్నం: ముఖ్యమంత్రి జగన్ కరోనాను చాలా లైట్ గా తీసుకున్నారని... తాము కూడా అలాగే భావించామని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ డబ్బులు అడగని వాళ్ళకి డబ్బులు ఇస్తున్న ప్రభుత్వం.. ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకొని నర్సింగ్  సిబ్బంది, డాక్టర్లను నియమించడంలో,  ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. విశాఖలో కరోనా పరిస్థితి నిస్సహాయ స్థితికి  చేరుకుందని ఆయన తెలిపారు. విశాఖలో నెల రోజుల్లోనే 50 వేల కేసులు చేరుకుంటుందని అంచనాలు చెబుతున్నాయన్నారు. విశాఖలో కనీసం పది రోజులు లాక్‌డౌన్  చేయాల్సిన అవసరం ఉందని.. లేకపోతే సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ విశాఖలో అన్ని పార్టీలతో ఒక మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా సమయంలో వైన్‌షాప్‌లో సమయం పెంచడం దారుణమని మండిపడ్డారు. టెస్టులు ఎన్ని రోజుల్లో వస్తుందో తెలియని పరిస్థితి అని... అంబులెన్స్ కూడా ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. కరోనా వచ్చిన వ్యక్తిని పంపించే ముందు టెస్ట్ నిర్వహించడం లేదని విష్ణుకుమార్‌ రాజు విమర్శించారు.

Updated Date - 2020-07-28T17:49:34+05:30 IST