రమేష్‌కుమార్‌ను కులంపేరుతో దూషించడం హేయం: రఘురాం
ABN , First Publish Date - 2020-05-29T14:29:19+05:30 IST
మాజీ ఎస్‌ఈసీ రమేష్‌కుమార్ వ్యవహారంలో కోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుందని భావిస్తున్నట్లు బీజేపీ నేత రఘురాం

విజయవాడ: మాజీ ఎస్‌ఈసీ రమేష్‌కుమార్ వ్యవహారంలో కోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుందని భావిస్తున్నట్లు బీజేపీ నేత రఘురాం అన్నారు. రమేష్‌కుమార్‌ను కులం పేరుతో దూషించడం హేయమని చెప్పారు. ఎన్నికల కమిషనరే తనకు ప్రాణహాని ఉందని భయపడితే... ఎన్నికలు ఎలా నిర్వహించగలరని వ్యాఖ్యానించారు. వివాదానికి ప్రభుత్వం, రమేష్‌కుమార్ ఇద్దరూ కారణమేనని తెలిపారు. వైసీపీ ప్రభుత్వానికి చాలా సార్లు కోర్టు మొట్టికాయలు వేసిందని గుర్తుచేశారు. కేంద్రానికి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సీక్రెట్‌గా లేఖ రాయడం సరికాదని అభిప్రాయపడ్డారు. లేఖపై కేంద్రమంత్రి స్పందించేదాకా నిమ్మగడ్డ బయటపెట్టలేదన్నారు. ప్రభుత్వం తనకు నచ్చనివారిని తీసేయడమనేది కూడా సరికాదని రఘురాం ఏబీఎన్‌తో అన్నారు.