-
-
Home » Andhra Pradesh » bjp leader kanna laxminarayana
-
ఏం చేసైనా...రాయలసీమకు నీళ్లు ఇవ్వాల్సిందే: కన్నా
ABN , First Publish Date - 2020-05-13T16:41:14+05:30 IST
ఏం చేసైనా...రాయలసీమకు నీళ్లు ఇవ్వాల్సిందే: కన్నా

గుంటూరు: శ్రీశైలంలోని మిగులు జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకునే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. తెలంగాణతో ఏపీ ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తారో, ఏమీ చేస్తారో తెలియదని... రాయలసీమకు మాత్రం వెనక్కి తగ్గకుండా నీళ్ళు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలని గతంలో బీజేపీ పోరాటాలు చేసిందని కన్నా లక్ష్మీనారాయణ గుర్తుచేశారు.
బుధవారం ఉదయం జిల్లాలోని రెడ్డిపాలెంలో గల క్వారంటైన్ సెంటర్‌ను కన్నా పరిశీలించారు. మాజీ మంత్రి రావెల కిషోర్‌తో కలిసి బాధితులను పరామర్శించిన ఆయన సెంటర్‌లో ఉన్న 120 మంది బాగానే ఉన్నారని తెలిపారు.