లాక్‌డౌన్ పొడిగింపు నిర్ణయం హర్షనీయం: కన్నా

ABN , First Publish Date - 2020-04-14T17:01:18+05:30 IST

లాక్‌డౌన్ పొడిగింపు నిర్ణయం హర్షనీయం: కన్నా

లాక్‌డౌన్ పొడిగింపు నిర్ణయం హర్షనీయం: కన్నా

గుంటూరు: దేశంలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకోవడం హర్షనీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. దేశ ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు పాటించాలని ఆయన కోరారు. ప్రధాని తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయం ప్రపంచ దేశాలకు ఆదర్శమన్నారు.


జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపాటు

తన 46 రాజకీయ జీవితంలో జగన్ లాంటి నియంత సీఎంని చూడలేదని కన్నా విమర్శించారు. తన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసమే జగన్ పని చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల ప్రాణాలు కంటే జగన్‌కు ఎన్నికలు ఎక్కవ అయ్యాయని ఆయన మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన నగదును కూడా తన పార్టీ డబ్బుగా పంపిణీ చేస్తున్నారు. కరోనా కేసుల విషయంలో ఏపీ కూడా తప్పుడు లెక్కలు చూపుతోందని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.

Updated Date - 2020-04-14T17:01:18+05:30 IST