నెల్లూరులో బీజేపీ ఫ్లెక్సీల రగడ

ABN , First Publish Date - 2020-12-26T21:06:09+05:30 IST

జిల్లాలో ఫ్లెక్సీల తొలగింపు వివాదానికి దారి తీసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పర్యటన సందర్భంగా మినీ

నెల్లూరులో బీజేపీ ఫ్లెక్సీల రగడ

నెల్లూరు: జిల్లాలో ఫ్లెక్సీల తొలగింపు వివాదానికి దారి తీసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పర్యటన సందర్భంగా మినీ బైపాస్‌లో బీజేపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఫ్లెక్సీలను నగరపాలకసంస్థ అధికారులు తొలగించారు. ఈ విషయంపై బీజేపీ నేతలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, బీజేపీ నాయకులకు మధ్య ఘర్షణ జరిగింది. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. అధికారపార్టీ నేతల ఫ్లెక్సీలకు లేని అభ్యంతరం తమ పార్టీ ఫ్లెక్సీలపై ఎందుకని ప్రశ్నించారు. అయితే నగరంలో ఫ్లెక్సీల తొలగింపు విషయం చర్చనీయాంశమైంది.

Updated Date - 2020-12-26T21:06:09+05:30 IST