ఆ నలుగురి ఆమోదంతోనే ఏపీలో ఎన్నికల ఖర్చు: సన్యాసిరాజు

ABN , First Publish Date - 2020-04-22T02:10:48+05:30 IST

బీజేపీలో ఒకే అకౌంట్‌తో లావాదేవీలు జరుగుతాయని బీజేపీ రాష్ట్ర కోశాధికారి సన్యాసిరాజు అన్నారు. బీజేపీకి సంబంధించిన...

ఆ నలుగురి ఆమోదంతోనే ఏపీలో ఎన్నికల ఖర్చు: సన్యాసిరాజు

విజయనగరం: బీజేపీలో ఒకే అకౌంట్‌తో లావాదేవీలు జరుగుతాయని బీజేపీ రాష్ట్ర కోశాధికారి సన్యాసిరాజు అన్నారు. బీజేపీకి సంబంధించిన నిధులు ఖర్చు చేయడానికి.. సమకూర్చడానికి నలుగురు సభ్యుల ఆమోదం లభించినప్పుడు మాత్రమే వీలౌతుందని ఆయన తెలిపారు. ఏపీలో ఎన్నికల ఖర్చు అంతా ఆ నలుగురి ఆదేశానుసారం మాత్రమే జరుగుతుందన్నారు. దీ‌నిపై రాష్ట్రంలో వేరెవరి ప్రమేయం ఉండదని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాను వివాదంలోకి లాగడం దురదృష్టకరమని  సన్యాసిరాజు వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-04-22T02:10:48+05:30 IST