వైవీది అనాలోచిత వైఖరి: బీజేపీ
ABN , First Publish Date - 2020-09-20T09:06:55+05:30 IST
వైవీది అనాలోచిత వైఖరి: బీజేపీ

అమరావతి/తిరుపతి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): డిక్లరేషన్ అవసరం లేదన్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటనను బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు ఆక్షేపించారు. రాష్ట్రపతి హోదాలో తిరుమల వచ్చిన అబ్దుల్ కలా మ్ కూడా రిజిస్టర్‌లో సంతకం చేశారని ట్విట్టర్‌లో గుర్తు చేశారు. ‘డిక్లరేషన్ ఇవ్వాలనే చట్టం టీటీడీలో ఎప్పటినుంచో ఉంది. ఏన్నో ఏళ్ల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని వ్యక్తుల కోసం మార్చకండి’ అంటూ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి హితవు పలికారు.