గవర్నర్ ప్రసంగంలో 3 రాజధానుల ప్రస్తావన
ABN , First Publish Date - 2020-06-16T17:41:01+05:30 IST
గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగంలో 3 రాజధానుల అంశం ప్రస్తావనకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగం

విజయవాడ: గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగంలో 3 రాజధానుల అంశం ప్రస్తావనకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా 3 రాజధానుల అంశం గురించి మాట్లాడారు. ‘‘మా పాలనలో పరిపాలన వికేంద్రికరణ కీలక అంశం. మూడు రాజధానులు కలిగి ఉండే అవకాశం. శాసనం ప్రక్రియలో ఉంది. అమరావతి శాసన రాజధానిగా, విశాఖ కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా’’ ఉంటుందని గవర్నర్ ప్రసంగించారు.