-
-
Home » Andhra Pradesh » Bhramaramba Mallikarjuna
-
మహాదుర్గగా భ్రమరాంబ
ABN , First Publish Date - 2020-03-24T09:28:55+05:30 IST
ఉగాది మహోత్సవాలలో భాగంగా శ్రీశైలంలో రెండో రోజు సోమవారం భ్రమరాంబదేవి మహాదుర్గ ఆలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

శ్రీశైలం, మార్చి 23: ఉగాది మహోత్సవాలలో భాగంగా శ్రీశైలంలో రెండో రోజు సోమవారం భ్రమరాంబదేవి మహాదుర్గ ఆలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మల్లికార్జునుడు కైలాసవాహనంపై సేవలందుకున్నారు. ఉత్సవమూర్తులను ఆలయం లోపలే ఊరేగించారు. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఆలయంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనాలను నిలిపివేశారు.