భీమవరంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-06-16T17:14:01+05:30 IST
భీమవరంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. భీమవరం వన్‌టౌన్‌లో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అలాగే భీమవరం రూరల్ పరిధిలో కువైట్ నుంచి వచ్చిన ఐదుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం పాలకొల్లు క్వారంటైన్‌లో ఉన్న వీరికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఏలూరు కోవిడ్ ఆస్పత్రికి తరలించారు.