ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షలు ప్రారంభం

ABN , First Publish Date - 2020-11-26T09:08:38+05:30 IST

ఇంద్రకీలాద్రిపై బుధవారం ఉదయం భవానీ దీక్ష స్వీకరణ కార్యక్రమాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా ప్రారంభించారు.

ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షలు ప్రారంభం

విజయవాడ, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రిపై బుధవారం ఉదయం భవానీ దీక్ష స్వీకరణ కార్యక్రమాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ నెల 30 వరకు మండల దీక్షలు (41 రోజులు), వచ్చేనెల 15 నుంచి 19 వరకు అర్థమండల దీక్షలు చేపట్టే భక్తులకు మాలధారణ చేస్తారు. వచ్చే ఏడాది జనవరి 5 నుంచి 9 వరకు ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ఉత్సవాలు నిర్వహిస్తామని దుర్గగుడి కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురే్‌షబాబు తెలిపారు.

Updated Date - 2020-11-26T09:08:38+05:30 IST