తిరుమలను వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చకండి: భానుప్రకాష్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-12-29T14:17:27+05:30 IST

తిరుమల: హిందువుల ఆధ్యాత్మిక రాజధాని తిరుమల అని... కలియుగ ఇల వైకుంఠమైన దీనిని వివాదాలకు

తిరుమలను వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చకండి: భానుప్రకాష్‌రెడ్డి

తిరుమల: హిందువుల ఆధ్యాత్మిక రాజధాని తిరుమల అని... కలియుగ ఇల వైకుంఠమైన దీనిని వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చవద్దని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి కోరారు. ప్రతి చిన్న అంశాన్ని భూతద్దంలో చూసి హిందువుల మనోభావాలను గాయపర్చవద్దన్నారు. తిరుమల రాజకీయాలకు అతీతమైన క్షేత్రమని... తిరుమలలో అన్యమతాలకు శుభాకాంక్షలు తెలపడం మంచిది కాదన్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడేవారికి టీటీడీ గట్టి సూచనలు జారీ చెయ్యాలని డిమాండ్ చేశారు. తిరుమల మనదని... దాని పవిత్రను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదని భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. 


Updated Date - 2020-12-29T14:17:27+05:30 IST