వైద్యురాలి ‘నిండు’మనసు!

ABN , First Publish Date - 2020-04-26T12:21:35+05:30 IST

వైద్యురాలి ‘నిండు’మనసు!

వైద్యురాలి ‘నిండు’మనసు!

ఏడు నెలల గర్భంతోనూ కరోనా అనుమానితులకు వైద్యం   

అనంతపురం/గోరంట్ల: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) వైద్యాధికారి ప్రత్యూష నిండైన మనసు చాటుకుంటున్నారు. ఏడు నెలల గర్భంతోనూ విధులకు హాజరవుతున్నారు. అంతేకాదు, క్వారంటైన్‌లోని కరోనా అనుమానితులకు చికిత్సలు చేస్తున్నారు. గోరంట్ల పీహెచ్‌సీలో ఆమెతోపాటు డా.గిరిధర్‌ విధులు నిర్వహిస్తున్నారు. ప్రత్యూష స్థానికంగా నివాసముంటుండటంతో రాత్రివేళల్లో వచ్చే అత్యవసర కేసులు, నిండు గర్భిణులకు చికిత్స అందిస్తున్నారు. క్వారంటైన్‌లో కూడా పనిచేస్తున్నారు. కర్ణాటకలో కరోనా కేసులు ప్రబలటంతో బెంగళూరు ప్రాంతం నుంచి స్వగ్రామాలకు వస్తున్న వలస కార్మికులను అధికారులు గోరంట్ల, క్వారంటైన్‌లో ఉంచారు. క్వారంటైన్‌లోని వారికి వైద్యురాలు ప్రత్యూష పరీక్షలు చేస్తున్నారు.

Updated Date - 2020-04-26T12:21:35+05:30 IST