బెంగాల్‌ కూలీలను రెచ్చగొట్టారు: సీపీ

ABN , First Publish Date - 2020-05-18T00:20:28+05:30 IST

పటమటలో కొందరు బెంగాల్‌ కూలీలను రెచ్చగొట్టారని సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. సొంత రాష్ట్రానికి వెళ్లడానికి బెంగాల్‌కూలీలు రిజిస్టర్ చేసుకున్నారని చెప్పారు.

బెంగాల్‌ కూలీలను రెచ్చగొట్టారు: సీపీ

విజయవాడ: పటమటలో కొందరు బెంగాల్‌ కూలీలను రెచ్చగొట్టారని సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. సొంత రాష్ట్రానికి వెళ్లడానికి బెంగాల్‌కూలీలు రిజిస్టర్ చేసుకున్నారని చెప్పారు. బెంగాల్‌ కార్మికులకు తగిలినవి లాఠీ దెబ్బలు కావన్నారు. కార్మికులను రెచ్చగొట్టిన వారిని అరెస్ట్ చేశామని కోర్టులో హాజరుపరుస్తామని పేర్కొన్నారు. వలస కూలీలకు మాస్క్‌లు, శానిటైజర్లు, ఆహారం అందిస్తున్నామని, రాజకీయ పక్షాలు లాక్‌డౌన్ టైమింగ్స్‌ పాటించాల్సిందేనని తిరుమలరావు చెప్పారు.

Updated Date - 2020-05-18T00:20:28+05:30 IST