కొత్త చట్టాలతో రైతులకు మేలు: మురళీధరన్‌

ABN , First Publish Date - 2020-12-28T08:54:19+05:30 IST

కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు మేలు జరుగుతుందని విదేశీ, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్‌ చెప్పారు.

కొత్త చట్టాలతో రైతులకు మేలు: మురళీధరన్‌

ఏలూరు, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు మేలు జరుగుతుందని విదేశీ, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్‌ చెప్పారు. ఆదివారం ఏలూరులోని బీజేపీ కార్యాలయం నుంచి ఆయన మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ చట్టాల ద్వారా రైతులకు స్వేచ్ఛ లభించిందన్నారు. రైతు తన పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని, కాని పక్షంలో స్థానిక మార్కెట్‌ యార్డులో అమ్ముకునే అవకాశం ఉందన్నారు. 

Updated Date - 2020-12-28T08:54:19+05:30 IST