డైవర్షన్ రాజకీయాలొద్దు: వైసీపీకి బీదా రవిచంద్ర హితవు
ABN , First Publish Date - 2020-10-19T19:03:21+05:30 IST
డైవర్షన్ రాజకీయాలు వద్దని వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ నేత బీదా రవిచంద్ర హితవు పలికారు. ‘రైతుల సమస్యలపై మాట్లాడితే ఎదురు దాడి చేస్తుంది అధికార పార్టీ. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డిపై విమర్శలు చేస్తున్నారు

నెల్లూరు: డైవర్షన్ రాజకీయాలు వద్దని వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ నేత బీదా రవిచంద్ర హితవు పలికారు. ‘రైతుల సమస్యలపై మాట్లాడితే ఎదురు దాడి చేస్తుంది అధికార పార్టీ. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. ఎన్ని విమర్శలు చేసినా రైతుల సమస్యలపై పోరాడటానికి వెనకడుగు వేయం. స్వయాన సాక్షి పత్రికలో ప్రభుత్వ తీరుపై వార్తలు వచ్చినా టీడీపీపై విరుచుకుపడుతున్నారు. జిల్లాలో రైతులు పంట పండించుకునేందుకు సహాయం చేసింది సోమిరెడ్డి కాదా? గతంలో రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లా రైతు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లాం. యాష్ పాండ్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్సార్ హయాంలో జరిగినది వాస్తవం కాదా? జిల్లా పరిషత్ చైర్మన్‌గా, రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న కాకాణి హుందాగా వ్యవహరించాలి. టీడీపీ పార్టీ పాలనలో అవినీతి జరిగుంటే ఎంక్వైరీ వేయండి. జిల్లాలో రైతులు కోట్ల రూపాయలు నష్టపోయారు వారిని ఆదుకోండి’ అని ప్రభుత్వానికి బీదా రవిచంద్ర విజ్ఞప్తి చేశారు.