అందరికంటే భిన్నంగా... పరిటాల శ్రీరామ్ ఛాలెంజ్

ABN , First Publish Date - 2020-04-26T16:05:27+05:30 IST

బి ది రియల్ మ్యాన్ ఛాలెంజ్ .. తెలుగునాట జోరుగా సాగుతోంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఒకరికొకరు ఛాలెంజ్‌ చేసుకుంటూ ఈ జాబితాను పెంచుకుంటూ పోతున్నారు.

అందరికంటే భిన్నంగా... పరిటాల శ్రీరామ్ ఛాలెంజ్

వెంకటాపురం: బి ది రియల్ మ్యాన్ ఛాలెంజ్ .. తెలుగునాట జోరుగా సాగుతోంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఒకరికొకరు ఛాలెంజ్‌ చేసుకుంటూ ఈ జాబితాను పెంచుకుంటూ పోతున్నారు. అంతేగాక తాము చేసిన పనులను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ.. ఫ్యాన్స్‌లో కూడా జోష్ పెంచుతున్నారు. ఇదంతా ఒకెత్తైతే.. టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ అందరికంటే భిన్నంగా తనను తాను నామినేట్ చేసుకున్నారు. రైతు బిడ్డగా వ్యవసాయ పనులను చేసి.. అందరికీ పెద్ద సవాలు విసిరారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్‌లో పేర్కొంటూ.. ‘‘నాన్నకి ఇష్టమైన, నాకు అందుబాటులో ఉన్న వ్యవసాయ పనులు చేశాను. మీరు కూడా మీకు అందుబాటులో వున్న పనులు చేస్తారని ఆశిస్తున్నాను’’ అంటూ ట్వీట్ చేశారు. అంతేగాక ఈ ఛాలెంజ్‌కు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్, ఎంపీ జయదేవ్ గల్లా, సినీ నటుడు మోహన్ బాబు, సినీ దర్శకుడు ఎన్.శంకర్, శ్యామ్ బాబులను నామినేట్ చేశారు.ఎవరో ఛాలెంజ్ చేయడం కంటే... ఆ ఛాలెంజ్ ప్రతి ఒక్కరూ స్వతగా స్వీకరించాలని... నిజమైన మనిషిగా నిలబడాలని చెప్పకనే చెప్పారు శ్రీరామ్. Updated Date - 2020-04-26T16:05:27+05:30 IST