బాపట్లలో స్థలం వివాదం.. వీరేశ్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-07-15T02:34:48+05:30 IST

బాపట్లలో స్థలం వివాదం..   వీరేశ్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం

గుంటూరు: బాపట్లలో వీరేశ్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయన గతంలో ఓ పార్టీకి చెందిన నాయకుడి దగ్గర డ్రైవర్‌గా పని చేశారు. ఆ సమయంలో వీరేశ్ పేరు మీద బాపట్లలో 5 సెంట్ల స్థలాన్ని సదరు రాజకీయ నాయకుడు రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే ఇప్పుడు ఆ స్థలాన్ని ఇవ్వాలని వీరేశ్‌పై రాజకీయనాయకుడి అనుచరులు ఒత్తిడి చేశారు. స్థలం ఇవ్వడానికి వీరేశ్ నిరాకరించడంతో బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో మనస్థాపం చెందిన వీరేశ్ ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం వీరేశ్‌కు బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రి‌లో చికిత్స కొనసాగుతోంది. రాజకీయ నాయకుడి అనుచరుల బెదిరింపులు వల్లే ఆత్మహత్య యత్నం చేసినట్లు వీరేశ్ స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

Updated Date - 2020-07-15T02:34:48+05:30 IST