స్వరూపానంద వైసీపీ స్వామిగా మారిపోయారు: బండారు

ABN , First Publish Date - 2020-09-18T20:35:03+05:30 IST

విశాఖ: శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానంద స్వామిజీపై మాజీ మంత్రి బండారు సంచలన వ్యాఖ్యలు చేశారు.

స్వరూపానంద వైసీపీ స్వామిగా మారిపోయారు: బండారు

విశాఖ: శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానంద స్వామిజీపై మాజీ మంత్రి బండారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రిషికేశ్ వెళ్లిన స్వామీజీ ఏం మతం వారు ఇచ్చిన విమానాల్లో వెళ్లారో చెప్పాలని నిలదీశారు. దేవాలయాలపై దాడులు జరుగుతున్నా స్వామీజీల పట్టించుకోకపోవడం దారుణమన్నారు. స్వామీజీలను నమ్మే పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. శారదా పీఠం పార్టీ కార్యాలయంగా మారిందన్నారు. స్వరూపానంద వైసీపీ స్వామిగా మారిపోయారని మాజీ మంత్రి బండారు స్పష్టం చేశారు.

Updated Date - 2020-09-18T20:35:03+05:30 IST