‘చింతామణి’ని నిషేధించండి

ABN , First Publish Date - 2020-12-28T08:44:50+05:30 IST

చింతామణి’ నాటక ప్రదర్శనను నిషేధించాలని ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గ్లోబల్‌ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

‘చింతామణి’ని నిషేధించండి

ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ డిమాండ్‌


చెన్నై, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): ‘చింతామణి’ నాటక ప్రదర్శనను నిషేధించాలని ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గ్లోబల్‌ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. వందేళ్ల కిందట రాసిన నాటకం.. ఆర్య వైశ్యులను కించపరచే విధంగా ఉందని, దీనిని అడ్డుపెట్టుకుని ఇప్పటికీ వైశ్యులను కించపరిచేలా ప్రదర్శనలు కొనసాగడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. చెన్నైలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కొంతమంది స్వీయప్రయోజనాల కోసం ‘చింతామణి’ నాటకాన్ని మళ్లీ తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దానధర్మాలకు పేరుగాంచిన వైశ్యులను కించపరస్తూ, ద్వంద్వార్థాలున్న పదాలు వాడుతూ నీచంగా చిత్రీకరిస్తున్నారని తెలిపారు. బాధ్యతగల పదిలో ఉన్న ఏ నాయకుడైనా వీరిని ప్రోత్సహించినా, చింతామణి ప్రదర్శనలకు అతిథులుగా హాజరైనా వారిని రాజకీయంగా బహిష్కరించేందుకు వైశ్యులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఏ చోటైనా చింతామణి నాటక ప్రదర్శనకు ఏర్పాట్లు జరిగితే స్థా నికంగా ఉండే వైశ్యులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే చట్టప్రకారం తదుపరి చర్యలను ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తీ సుకుంటుందన్నారు. తెలుగు రాష్ట్రాల పాలకులు ఆ నాటకా న్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-12-28T08:44:50+05:30 IST