అల్లూరిని చూసిన బాలుదొర ఇక లేరు!

ABN , First Publish Date - 2020-11-25T09:46:05+05:30 IST

విప్లవ వీరుడు అల్లూ రి సీతారామరాజును పిన్న వయస్సులో చూసిన బీరబోయిన బాలుదొర(105) ఇకలేరు. ఆయన ఈ నెల 22న తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం కొండపల్లిలో మృతి చెందారు

అల్లూరిని చూసిన బాలుదొర ఇక లేరు!

రాజవొమ్మంగి, నవంబరు 24: విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజును పిన్న వయస్సులో చూసిన బీరబోయిన బాలుదొర(105) ఇకలేరు. ఆయన ఈ నెల 22న తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం కొండపల్లిలో మృతి చెందారు. ఎనిమిదేళ్ల వయసున్నప్పుడు అల్లూరిని చూసిన బాలుదొర.. చనిపోయేవరకూ కటిక పేదరికంలోనే మగ్గిపోయారు. నాడు.. పితూరి సభల ని ర్వహణలో భాగంగా కొండపల్లి గ్రామానికి అల్లూరి వ చ్చేవారు. ఇక్కడి గిరిజనులతో మమేకమై సభలు నిర్వహించేవారు. ఆ సమయంలో బీరబోయిన సుబ్బయ్య అనే గిరిజనుడు.... తొమ్మిదేళ్ల వయసులో ఉన్న తన కుమారుడు బాలుదొరను తీసుకువెళ్లేవాడు. అల్లూరి సభలతో ఎంతో స్ఫూర్తి పొందిన బాలుదొర.. గ్రామస్థులకు అల్లూరి పోరాట పటిమ గురించి చెబుతుండేవారు. బాలుదొరకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.. ఐదుగురు మునివళ్లు ఉన్నారు. చివరి వరకు పూరి గుడెసెలోనే జీవించారు. 

Updated Date - 2020-11-25T09:46:05+05:30 IST