నగరానికి దూరంగా ఇళ్ల స్థలాలు కేటాయించడం దారుణం: బాబూరావు
ABN , First Publish Date - 2020-07-08T17:45:25+05:30 IST
విజయవాడ: నగరంలోని పేద వారికి వారు ఉండే ప్రాంతంలోనే నివేశ స్థలాలు కేటాయించాలని కోరుతూ విజయవాడ అజిత్ సింగ్ నగర్ డిస్నీలాండ్ ముందు సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.
విజయవాడ: నగరంలోని పేద వారికి వారు ఉండే ప్రాంతంలోనే నివేశ స్థలాలు కేటాయించాలని కోరుతూ విజయవాడ అజిత్ సింగ్ నగర్ డిస్నీలాండ్ ముందు సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి చిగురుపాటి బాబూరావు మాట్లాడుతూ.. విజయవాడ నగరంలోనే అనేక ప్రాంతాలలో స్థలాలు ఉండగా నగరానికి సూదూర ప్రాంతంలో ఇళ్ళ స్ధలాలు కేటాయించటం దారుణమన్నారు.
పేదలను నగరానికి దూరంగా పంపి నగరంలోని విలువైన భూములు బిల్డ్ ఏపీ పేరుతో అమ్మకాని పెడతారోమో అనుమానాలున్నాయన్నారు. నిరుపయోగంగా ఉన్న డిస్నీలాండ్‌లోని 57 ఎకరాల స్థలాన్ని పేద ప్రజలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించాలన్నారు. సింగ్ నగర్ ప్రాంతంలో గత ప్రభుత్వం కట్టించిన గృహాలను స్థానిక పేదలకు కేటాయించకుండా నగరానికి దూరంగా కేటాయించటానికి సీపీఎం వ్యతిరేకమని బాబూరావు తెలిపారు.