‘ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం’

ABN , First Publish Date - 2020-12-11T18:12:43+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పెను భారాలను పెంచుతూ తిప్పలు పెడతున్నాయిని సీపీఎం నేత బాబురావు వ్యాఖ్యానించారు.

‘ప్రజా సమస్యలు  పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం’

విజయవాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పెను భారాలను మోపుతూ తిప్పలు పెడతున్నాయిని  సీపీఎం నేత బాబురావు వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం పనికిరాని సంక్షేమ పథకాలను పెట్టి ప్రజల నుంచి లక్షల కోట్లు పన్నుల రూపంలో దండుకుంటోందని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే ఆస్తి పన్ను చెల్లింపు విధానాన్ని ఉపసంహరించుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని ఆయన అన్నారు. సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు ఇబ్బంది పడతున్నారన్నారు. రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేశారని ఆక్షేపించారు. మహిళలపై దాడులు జరుగుతున్న ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చెప్పారు.  ప్రజా సమస్యలు  పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని ఆరోపించారు.

Updated Date - 2020-12-11T18:12:43+05:30 IST