నెల్లూరు టీడీపీ కార్యకర్తకు బాబు అభినందనలు

ABN , First Publish Date - 2020-07-10T09:26:33+05:30 IST

నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ కార్యకర్త శ్రీకాంత్‌రెడ్డికి ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఫోన్‌

నెల్లూరు టీడీపీ కార్యకర్తకు బాబు అభినందనలు

అమరావతి, జూలై 9(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ కార్యకర్త శ్రీకాంత్‌రెడ్డికి ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఫోన్‌ చేశారు. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టాడనే నెపంతో పోలీసులు బెదిరించారన్న సమాచారంతో గురువారం ఫోన్‌ చేసిన బాబు... నేనున్నా అంటూ ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు... ‘‘భావప్రకటన స్వేచ్ఛని కాపాడుకోవటానికి అలా మాట్లాడడం తప్పులేదు. పోలీస్‌ వ్యవస్థ ప్రజల్ని రక్షించేలా ఉండాలి. బెదిరింపులకు, రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు వ్యవస్థను వాడుకోవడం దారుణం. పౌరుల ప్రాథమిక హక్కుల్ని కాలరాసే అధికారం ఎవ్వరికీ లేదు. తప్పు చేయని వాళ్లు భయపడనవసరం లేదు. పోలీసు వ్యవస్థలో పారదర్శకత కోసమే బాడీవోన్‌ కెమెరాలను ప్రవేశపెట్టాం. రాష్ట్రంలో అంబేద్కర్‌ రాజ్యాంగం అమలులో లేదు. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు. ఒక కార్యకర్తగా మీరు పోలీసులకు అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని గుర్తు చేశారు. మీ ధైర్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’’ అని అన్నారు. 

Updated Date - 2020-07-10T09:26:33+05:30 IST