దమ్ముంటే గుడికి రావాలి: గుడివాడ అమర్నాథ్

ABN , First Publish Date - 2020-12-27T17:45:39+05:30 IST

తూర్పు నియోజకవర్గంలో టీడీపీ-వైసీపీ నేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకున్నారు. కయ్యానికి కాలు దువ్వడమే పనిగా వైసీపీ దూకుడు పెంచింది.

దమ్ముంటే గుడికి రావాలి: గుడివాడ అమర్నాథ్

విశాఖ: తూర్పు నియోజకవర్గంలో టీడీపీ-వైసీపీ నేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకున్నారు. కయ్యానికి కాలు దువ్వడమే పనిగా వైసీపీ దూకుడు పెంచింది. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై వైసీపీ నేతలు అవినీతి ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో వెలగపూడికి అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సవాల్ చేశారు. అవినీతికి పాల్పడకపోతే ఈస్ట్ పాయింట్ కాలనీలో సాయిబాబా గుడికి వచ్చి ప్రమాణం చేయాలన్నారు.


ఈసందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ.. వెలగపూడి రామకృష్ణ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆధారాలతో సహా బాబా గుడికి వచ్చానని.. దమ్ముంటే  వెలగపూడి గుడికి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. విజయసాయిరెడ్డి వస్తేనే ప్రమాణం చేస్తామనడం సరికాదని ఆయన చెప్పారు. తాము వచ్చాక మీరు రాకపోతే ఆరోపణలు ఒప్పుకున్నట్లేనని ఆయన అన్నారు. వెలగపూడిపై క్రిమినల్ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఆలయంలో గంటపాటు వేచి చూసి అమర్నాథ్ వెళ్లిపోయారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో బాబా గుడి వేదిక రాజకీయ రచ్చగా మారడంతో తూర్పు విశాఖలో అడుగడుగునా పోలీసులు మోహరించారు. 

Updated Date - 2020-12-27T17:45:39+05:30 IST