ఇళ్ల పట్టాల పేరుతో రూ. 4వేల కోట్లు స్వాహా: అయ్యన్నపాత్రుడు

ABN , First Publish Date - 2020-09-14T02:47:19+05:30 IST

పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో వైసీపీ ప్రభుత్వం రూ. 4వేల కోట్లు స్వాహా చేసిందని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. విశాఖ జిల్లాలోనే..

ఇళ్ల పట్టాల పేరుతో రూ. 4వేల కోట్లు స్వాహా: అయ్యన్నపాత్రుడు

విశాఖ: పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో వైసీపీ ప్రభుత్వం రూ. 4వేల కోట్లు స్వాహా చేసిందని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. విశాఖ జిల్లాలోనే వైసీపీ నేతలు రూ.150 కోట్లు దండుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కోర్టు వివాదంలో ఉన్న 4 వేల ఎకరాలు మినహాయించి 36 వేల ఎకరాల పట్టాలు ఎందుకు పంచడం లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో మంజూరైన ఇళ్ల పెండింగ్ బిల్లులు, పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-09-14T02:47:19+05:30 IST