జగన్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది: అయ్యన్నపాత్రుడు

ABN , First Publish Date - 2020-06-06T19:37:40+05:30 IST

విశాఖ: ఏడాది పాలన బాగోలేదని తాను మాట్లాడటం కాదని.. వైసీపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.

జగన్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది: అయ్యన్నపాత్రుడు

విశాఖ: ఏడాది పాలన బాగోలేదని తాను మాట్లాడటం కాదని.. వైసీపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందన్నారు. కర్మ కాలి జగన్ ముఖ్యమంత్రి అయ్యారని... ఆయనకు 50 మంది పైగా సలహాదారులు ఉన్నారన్నారు. వీళ్లంతా ఏం చేస్తున్నారని.. జగన్మోహన్ రెడ్డికి తన వెంట కొంత మంది ఐఏఎస్ అధికారులను జైలుకు తీసుకెళ్లడం అలవాటన్నారు. 


రాష్ట్రంలో అరాచక పాలన అడ్డుకోవడం ఒక్క కోర్టుల వల్ల మాత్రమే సాధ్యమైందని యనమల పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ, ఐపీఎస్‌లు ప్రభుత్వానిిక తొత్తులుగా మారి పోయారని విమర్శించారు. 20 రూపాయల మాస్ కోసం సీబీఐ వరకూ తీసుకెళ్లారని యనమల పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర రైతులకు జగన్ అన్యాయం చేస్తున్నారని.. అనకాపల్లిలో ఏర్పాటుచేసిన ఉద్యానవన అధ్యయన కేంద్రాన్ని రద్దు చేసి పులివెందులలో ఏర్పాటు చేశారని.. ఇది సరైంది కాదన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి 20 శాతం పనులైన ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం నిలిపివేసిందని యనమల విమర్శించారు.


Updated Date - 2020-06-06T19:37:40+05:30 IST