అడ్డపంచెలతో దిగిన మనుషులు దౌర్జన్యాలు చేస్తున్నారు: అయ్యన్న
ABN , First Publish Date - 2020-12-07T19:58:05+05:30 IST
విశాఖ: జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద టీడీపీ నిరసనకు దిగింది. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ..

విశాఖ: జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద టీడీపీ నిరసనకు దిగింది. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. ఆస్తి పన్ను పెంపును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖలో అడ్డపంచెలతో దిగిన మనుషులు దౌర్జన్యాలు చేస్తున్నారన్నారు. విజయసాయిరెడ్డి విశాఖలో రుబాబు చేస్తున్నారని.. బెదిరిస్తున్నారన్నారు. దేవాలయ భూముల్ని అమ్మితే సోమువీర్రాజు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. సీఎం జగన్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు లోపాయకారి ఒప్పందం చేసుకున్నారని అయ్యన్నపాత్రుడు విమర్శించారు.