జగన్‌లాంటి కుర్రకుంకల్ని చాలామందినే అయ్యన్న చూసుంటారు: లోకేశ్
ABN , First Publish Date - 2020-06-18T08:31:39+05:30 IST
‘‘అయ్యన్న పాత్రుడిది 37 ఏళ్ల మచ్చలేని రాజకీయ జీవితం. 10 శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవీకుడు. జగన్‌తో కలిపి 10 మంది ముఖ్యమంత్రుల్ని చూసిన సుదీర్ఘ అనుభవం...
అమరావతి, జూన్ 17(ఆంధ్రజ్యోతి): ‘‘అయ్యన్న పాత్రుడిది 37 ఏళ్ల మచ్చలేని రాజకీయ జీవితం. 10 శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవీకుడు. జగన్‌తో కలిపి 10 మంది ముఖ్యమంత్రుల్ని చూసిన సుదీర్ఘ అనుభవం. ఏజెన్సీ ప్రాంతానికి ఎంతో సేవ చేసిన సీనియర్ నేత. అలాంటి నేతపై ఏడాదిలో అట్రాసిటీ నుంచి నిర్భయ వరకు... జగన్ ప్రభుత్వం ఏడు కేసులు పెట్టింది’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ‘‘జగన్ పాలన ఎలా ఉంది అంటే... ఒక్క నర్సీపట్నంలో పెట్టిన కేసులు చూస్తే చాలు అర్థమవుతుంది. జగన్ లాంటి కుర్రకుంకల్ని చాలామందినే అయ్యన్న చూసి ఉంటారు’’ అంటూ ట్విటర్ వేదికగా బుధవారం లోకేశ్ ఎద్దేవా చేశారు.