చంద్రబాబుకు అవంతి శ్రీనివాస్ సవాల్

ABN , First Publish Date - 2020-12-20T00:01:50+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి అవంతి శ్రీనివాస్ సవాల్ విసిరారు. చంద్రబాబుకు దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబుకు అవంతి శ్రీనివాస్ సవాల్

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి అవంతి శ్రీనివాస్ సవాల్ విసిరారు. చంద్రబాబుకు దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. తమకు ఎన్నికలు అంటే భయం లేదని స్పష్టం చేశారు. అమరావతితో పాటు కర్నూలు, విశాఖ అభివృద్ధి కావడం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చొని జూమ్ రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవాచేశారు. చంద్రబాబు తన మనుషులతో కోర్టులో కేసులు వేయిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అవంతి శ్రీనివాస్‌ తెలిపారు.

Read more