-
-
Home » Andhra Pradesh » Avanthi srinivas fires on chandrababu
-
అమరావతిలో 100 మంది మహిళలను చూసి రెచ్చిపోతావా?: అవంతి
ABN , First Publish Date - 2020-12-19T16:46:37+05:30 IST
విశాఖ: 70 ఏళ్ల వయసులో టీడీపీ అధినేత చంద్రబాబు బూతులు మాట్లాడుతున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శించారు.

విశాఖ: 70 ఏళ్ల వయసులో టీడీపీ అధినేత చంద్రబాబు బూతులు మాట్లాడుతున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శించారు. నేడు ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తన మనవడికి ఈ బూతులే నేర్పిస్తున్నాడా? అని ప్రశ్నించారు. అమరావతిలో 100 మంది మహిళలను చూసి రెచ్చిపోతావా? అంటూ మండిపడ్డారు. అమరావతిపై రెఫరెండానికి ముందు విశాఖలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని అవంతి పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలు కొత్త కాదన్నారు.
విశాఖ రైల్వే జోన్‌ను బీజేపీ తాత్సరాం చేస్తోందన్నారు.
పోలవరంపై నిధుల విషయంలో కూడా బీజేపీ నేతలు కేంద్రాన్ని అడగాలన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ నేతలు కేంద్రంతో మాట్లాడి సహకరించాలని అవంతి కోరారు.