పార్టీ కోసం పని చేసిన వారికి జగన్ న్యాయం చేశారు: అవంతి

ABN , First Publish Date - 2020-11-06T16:58:10+05:30 IST

విశాఖపట్నం: వైసీపీ కార్యాలయంలో విశాఖ తూర్పు నియోజకవర్గ బీసీ డైరెక్టర్ల సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి అవంతి శ్రీనివాసరావు హాజరయ్యారు.

పార్టీ కోసం పని చేసిన వారికి జగన్ న్యాయం చేశారు: అవంతి

విశాఖపట్నం: వైసీపీ కార్యాలయంలో విశాఖ తూర్పు నియోజకవర్గ బీసీ డైరెక్టర్ల సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి అవంతి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ.. బీసీ డైరెక్టర్లకు తన అభినందనలు తెలిపారు. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు, నాయకులకు జగన్ న్యాయం చేశారన్నారు. జగన్ పాదయాత్ర ప్రారంభించి మూడేళ్లయిన సందర్భంగా.. పది రోజుల పాటు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అవంతి శ్రీనివాసరావు సూచించారు. 


Updated Date - 2020-11-06T16:58:10+05:30 IST