అత్యాచారయత్నం కేసులో ఆటోడ్రైవర్‌కు ఏడేళ్ల జైలు

ABN , First Publish Date - 2020-12-03T09:01:03+05:30 IST

అత్యాచారయత్నం కేసులో ఆటోడ్రైవర్‌కు ఏడేళ్ల జైలు

అత్యాచారయత్నం కేసులో ఆటోడ్రైవర్‌కు ఏడేళ్ల జైలు

కొత్తవలస, డిసెంబరు 2: బాలికపై అత్యాచారయత్నం చేసిన ఆటోడ్రైవర్‌కు ఏడేళ్ల కఠినకారాగార శిక్షతో పాటు రూ.45 వేల జరిమానా విధిస్తూ విజయనగరం ఒకటో అదనపు జిల్లా సెషన్స్‌ న్యాయమూర్తి కె.సుధామణి తీర్పు చెప్పారు. కొత్తవలస మండలంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న బాలిక 2016 డిసెంబర్‌ 27వ తేదీనఇంటికి వెళ్లడానికి కొత్తవలసలో ఆటోను ఆశ్రయించింది. లక్కవరపుకోట మండలం, లచ్చంపేట గ్రామానికి చెందిన అటో డ్రైవర్‌ కాకర వీరాస్వామి ప్రయాణికులందరూ దిగిపోయాక ముసిరాం-కళ్లేపల్లిగ్రామాల మధ్యలో ఆటో నిలిపి బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు. బాలిక ప్రతిఘటించడంతో పరారయ్యాడు. దీనిపై బాలిక తల్లితండ్రులు కొత్తవలస పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2020-12-03T09:01:03+05:30 IST