ఏయూలో సమీకృత బీబీఏ-ఎంబీఏ కోర్సు
ABN , First Publish Date - 2020-12-13T09:24:18+05:30 IST
ఏయూలో సమీకృత బీబీఏ-ఎంబీఏ కోర్సు

ఏయూ క్యాంపస్ (విశాఖపట్నం), డిసెంబరు 12: ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రారంభిస్తున్న ఐదేళ్ల సమీకృత బీబీఏ-ఎంబీఏ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.కృష్ణమోహన్ తెలిపారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి రూసా 2.0లో భాగంగా ఐఐఎంతో కలిసి ఆంధ్రా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ (ఏయూ ఎస్‌ఐబీ) ద్వారా ఈ కోర్సును అందిస్తున్నామన్నారు.