దళిత మహిళా వీఆర్వోపై దాడికి యత్నం

ABN , First Publish Date - 2020-10-03T07:08:14+05:30 IST

తనను కులంపేరుతో దూషించడంతో పాటు దాడికి యత్నించారంటూ వైసీపీ నేతలపై శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కొండగూడెం వీఆర్వో

దళిత మహిళా వీఆర్వోపై దాడికి యత్నం

సంతకవిటి(శ్రీకాకుళం), అక్టోబరు 2: తనను కులంపేరుతో దూషించడంతో పాటు దాడికి యత్నించారంటూ వైసీపీ నేతలపై శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కొండగూడెం వీఆర్వో సుశీల పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం సాయంత్రం తహసీల్దారు కార్యాలయంలో విధి నిర్వహణలో ఉండగా కొండగూడెం మాజీ సర్పంచ్‌, వైసీపీ నేత కెంబూరు సూర్యారావుతో పాటు మరో దాడికి యత్నించారని తెలిపారు.


శుక్రవారం ఉదయం ఆమెకు తోటి వీఆర్వోలు సంఘీభావం తెలుపుతూ తహసీల్దారు కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సూర్యారావు గ్రామస్థులతో కలిసి తహసీల్దారు కార్యాలయం వద్దకు వచ్చారు. వీఆర్వో సుశీల లంచం ఇవ్వనిదే పనిచేయడం లేదని ఆరోపించారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు వచ్చి ఇరు పక్షాలకు సర్దిచెప్పారు. తహసీల్దారుతో పాటు వైసీపీ కీలక నేతలూ చర్చలు జరిపారు.

తనకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని సుశీల తేల్చి చెప్పారు. సూర్యారావుతో పాటు మరో ముగ్గురుపై కేసు నమోదు చేసినట్టు రాజాం రూరల్‌ సీఐ తెలిపారు.


Updated Date - 2020-10-03T07:08:14+05:30 IST