పోలీసులపై దౌర్జన్యం!

ABN , First Publish Date - 2020-03-25T09:14:43+05:30 IST

లాక్‌డౌన్‌ విధుల్లో ఉన్న పోలీసులపై వాహనదారులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. విజయవాడ నాలుగో ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న...

పోలీసులపై దౌర్జన్యం!

  • బైక్‌ సీజ్‌ చేసినందుకు దాడి


విజయవాడ, మార్చి 24(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ విధుల్లో ఉన్న పోలీసులపై వాహనదారులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. విజయవాడ నాలుగో ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పిల్లి శ్రీధర్‌ కుమార్‌ రామవరప్పాడు రింగ్‌రోడ్డు వద్ద లాక్‌డౌన్‌ విధులు నిర్వర్తిస్తున్నాడు.


ఉదయం 9 గంటల అంబులెన్స్‌కు దారి ఇచ్చేందుకు రోడ్డుకు అడ్డుగా పెట్టిన బారికేడ్లను కానిస్టేబుల్‌ తీశాడు. అదే సమయంలో అటుగా ఇన్నోవా కారులో వస్తున్న ఓయువకుడు కానిస్టేబుల్‌ను ఢీకొట్టాడు. గాయపడిన కానిస్టేబుల్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ యువకుడిపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. మరో ఘటనలో బైక్‌ సైలెన్సర్‌ గురించి ప్రశ్నించినందుకు కానిస్టేబుల్‌ పీకపై చేయి వేశాడు ఓ యువకుడు. గురునానక్‌ కాలనీకి చెందిన మౌనేష్‌ రైతుబజార్‌కు వచ్చాడు. బుల్లెట్‌ సైలెన్సర్‌ శబ్దం ఎక్కువగా వస్తుండడంతో అక్కడున్న కానిస్టేబుల్‌... మౌనేష్‌ను ప్రశ్నించాడు. అనంతరం బైక్‌ను సీజ్‌ చేశాడు. దీంతో ఆ యువకుడు తండ్రితో కలిసి కానిస్టేబుల్‌పై దాడి చేశాడు.

Read more