-
-
Home » Andhra Pradesh » Attack on muncipal commissioner
-
పెడన మున్సిపాలిటీలో ఉద్రిక్తత.. మున్సిపల్ కమిషనర్‌పై దాడి
ABN , First Publish Date - 2020-12-28T15:09:27+05:30 IST
విజయవాడ: కృష్ణా జిల్లా పెడన మున్సిపాలిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెడన మున్సిపల్ కమిషనర్ అంజయ్యపై పారిశుధ్య కార్మికులు దాడికి పాల్పడ్డారు.

విజయవాడ: కృష్ణా జిల్లా పెడన మున్సిపాలిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెడన మున్సిపల్ కమిషనర్ అంజయ్యపై పారిశుధ్య కార్మికులు దాడికి పాల్పడ్డారు. అంజయ్య వాకింగ్‌కి వెళ్తున్న సమయంలో దాడికి పాల్పడ్డారు. లంకేశ్వరి అనే వర్కర్‌ను వేధిస్తూ, అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ అంజయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పెడన పోలీసులకు అంజయ్యపై పారిశుద్ధ్య కార్మికులు పిర్యాదు చేశారు. తనపై దాడి ఎందుకు జరిగిందో అర్థం కావటం లేదని, వాకింగ్‌కు వెళుతున్న తనపై ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని కమిషనర్ పేర్కొన్నారు. తనపై వస్తోన్న ఆరోపణలను అంజయ్య ఖండిస్తున్నారు. జరిగిన వివాదాలపై పెడన పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు.